ఒకరోజు మనిషి దేవునితో ఇలా అంటున్నాడు.

తండ్రి… నేను నిన్ను నిత్యం ప్రార్థిస్తున్నా. అయినా, నా జీవితంలో కష్టాలు , బాధలు తగ్గటం లేదు. నన్ను మర్చిపోయావా తండ్రి…?

అప్పుడు దేవుడు జాలిగా తనవైపు చూస్తూ ఇలా అన్నాడు…

నాన్న… నీకు ఇలా ఎందుకు అనిపించింది…?

అప్పుడు మనిషి ఇలా అన్నాడు...

నేను సంతోషంగా ఉన్నన్ని రోజులు నువ్వు నాతో ఉన్నావని నాకు అనిపించింది. కానీ, ఇప్పుడు మోయలేని కష్టాల్లోనూ, బాధలోనూ నేను ఉన్నా… ఈ సమయంలో, నువ్వు నాతో ఉన్నావని నాకు అనిపించడం లేదు…

అప్పుడు దేవుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు…

నీ జీవితాన్ని సముద్ర తీరంలో నడుస్తున్నట్లు ఒకసారి ఊహించు. ప్రతి సందర్భంలో, రెండు పాదముద్రలు కనిపిస్తాయి. ఒకటి నీది, మరోటి నాది…

అప్పుడు మనిషి తల ఊపుతూ ఇలా అన్నాడు….

అవును తండ్రి, నిజమే. కానీ, నా జీవితం అత్యంత కష్టమైన సమయంలో, మోయలేని భారాన్ని నేను మోస్తున్నప్పుడు మాత్రం ఒక్క పాదముద్రే కనిపించింది. అయితే, ఆ సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు…?

అప్పుడు దేవుడు నవ్వుతూ… ఇలా అన్నాడు….

నువ్వు కష్టాల ముళ్లదారిలో నడవలేక అలసిపోయావు. అందుకే, నా బిడ్డగా నిన్ను ఆ కష్టాల నుండి బయటకు తీసుకురావడానికి, నువ్వు నడవలేని స్థితిలో నేనే నిన్ను ఎత్తుకుని నడిచాను.
కాబట్టి, నీకు కనిపించిన ఆ ఒక్క పాదముద్ర నాదే. అందువల్లే, నీకు ఒక అడుగు జాడ మాత్రమే కనిపించింది…

అది విన్న వెంటనే, మనిషి కన్నులతో దేవునివైపు చూస్తూ, బిగ్గరగా ఏడుస్తూ దేవుణ్ణి హత్తుకొని ఏడ్చాడు…

కథ నీతి:

అందువల్ల దేవుడు ఎప్పుడూ మనల్ని విడిచి పెట్టడు. మోయలేని కష్టాలు మనకు ఎదురై మనం నడువలేకున్న… ఆయనే మన భారాన్ని మోస్తూ మన జీవిత గమ్యానికి చేరుస్తాడు… దేవునికి మనిషికి మధ్య ఉన్న బంధం.

img 20260106 012300

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *